telugu navyamedia
సామాజిక

పాకిస్థాన్ జాతీయ జండా… అత్యుత్తమ టాయిలెట్ పేపర్ అట…!?

Pakistan Flag is a Best Toilet Paper in the world in google search
ప్రపంచంలో అత్యుత్తమ టాయిలెట్ పేపర్ పాకిస్థాన్ జాతీయ జండానే అంట… ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా గూగుల్ తల్లే చెప్పింది. “Best toilet paper in the world” అని గూగుల్ లో టైపు చేస్తే చాలు పాకిస్థాన్ జాతీయ పతాకమే దర్శనమిస్తోంది. ఇప్పటికే పుల్వామా దాడితో ఉడికిపోతున్న భారతీయులకు ఈ విషయం ఓ ఆయుధంలా దొరికింది. ఇంకేముంది వెంటనే  “Best toilet paper in the world” అని టైపు చేసి, ఆ ఫోటోలను కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాయాది దేశంపై సెటైర్స్ వేస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు నెటిజన్లు. మీరు కూడా ట్రై చేయండి అంటూ ఓ ఆట ఆడుకున్నారు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న గూగుల్ నిర్వాహకులు వెంటనే తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. కానీ నెటిజన్లు షేర్ చేసిన స్క్రీన్ షాట్లు ఇప్పటికీ కన్పిస్తూ హల్చల్ చేస్తున్నాయి. 

Related posts