telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

భారతీయ సినిమా, టీవీ ప్రసారాలను .. నిలిపివేసిన పాక్ సుప్రీం కోర్ట్.. !

pak will lose if war declared with india

భారతీయ సినిమాలు, టీవీ షోలు పాకిస్థాన్‌ టీవీ చానెళ్లలో ప్రసారంపై ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులతో భారతీయ సినిమాలు, ఇతరత్రా వీడియోలు అక్కడి ప్రైవేటు చానళ్లు, టీవీ షోల్లో ప్రసారం కావు. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఉత్తర్వులను జారీచేసింది. పాక్‌లో భారతీయ టీవీ చానెళ్లను అనుమతిస్తూ గతంలో లాహోర్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంది.

ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్‌ఏ) ఆ దేశ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌ బెంచ్‌ ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Related posts