telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అనేక తీవ్రవాద సంస్థలను .. నిషేధించాం .. : పాక్

pak prohibited 10 more terrorist groups

పాక్ దేశం ముందడుగు, శాంతివైపు సరికొత్త అడుగు. ఉగ్రవాద సంస్థల అధినేతలు హఫీజ్ సయిద్, మసూద్ అజార్‌తో పాటు ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 10 ఉగ్రవాద సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చినట్లు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

నేషనల్ యాక్షన్ ప్లాన్(ఎన్‌ఏపీ)లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అల్ అన్ఫల్ ట్రస్ట్(లాహోర్), ఇదరే ఖద్మత్ ఖలాక్(లాహోర్), అల్ దావత్ ఉల్ ఇర్షాద్(లాహోర్), అల్ హమద్ ట్రస్ట్(లాహోర్, ఫైసలాబాద్), మాస్క్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్(లాహోర్), అల్ మదీనా ఫౌండేషన్(లాహోర్), మువాజ్ బిన్ జబల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్(లాహోర్), అల్ ఈసర్ ఫౌండేషన్(లాహోర్), అల్ రహమత్ ఆర్గనైజేషన్(భావల్పూర్), అల్ ఫర్ఖాన్ ట్రస్ట్(కరాచీ) సంస్థలపై నిషేధం విధించింది. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌పై ఇటీవలే ఐక్య‌రాజ్య స‌మితి(ఐరాస‌) అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసిన విషయం తెలిసిందే.

ఐరాస ప్రకటన వెలువడిన కొన్ని రోజులకే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తన పేరు మార్చుకున్నట్లు సమాచారం.

Related posts