telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చైనాతో స్నేహాన్ని .. బహిర్గతం చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ …

imran on terrorism in UN

చైనా పై మాకు కృతజ్ఞతా భావం ఉంది, అందుకే ఆ దేశంతో నెలకొన్న అభిప్రాయబేధాలపై మేం బహిరంగ వ్యాఖ్యలు చేయమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. చైనాలో ఉయ్‌ఘర్ ముస్లింల అణచివేతపై ఎందుకు స్పందించరన్న విలేకరి ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. ‘మేం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా చైనా మమ్మల్ని ఆదుకుంది. కాబట్టి ఎటువంటి భేదాభిప్రాయాలున్నా మేం ప్రైవేటుగానే చర్చిస్తాం. బహిరంగ వ్యాఖ్యలు చేయం’ అని ఇమ్రాన్ అన్నారు. చైనాలోని పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడం కూడా ఓ ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ‘యదార్థంగా చెప్పుకోవాలంటే.. చైనాలోని ఉయ్‌ఘర్ ముస్లింల పరిస్థితిపై అంతగా అవగాహన లేదు. అప్పుడప్పుడూ వార్తల్లో చదవడం తప్ప.. చైనాలో ఏం జరుగుతోందో నాకు పెద్దగా తెలీదు.’ అని ఇమ్రాన్ తెలిపారు.

చైనాలో మైనారిటీలైన ఉయ్‌ఘర్ ముస్లింలు అణివేతకు గురవడంతో అంతర్జాతీయంగా ఆ దేశం ఒత్తిడి ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ మతస్థులను బలవంతంగా క్యాంపులకు తరలించి, వారిని అణగదొక్కుతోందంటూ ఎప్పటి నుంచో చైనాపై ప్రపంచమంతా మండిపడుతోంది. కశ్మీర్ విషయంలో తెగ యాక్టివ్‌గా ఉండే పాక్.. ఉయ్‌ఘర్‌ల అణచివేతపై మౌనం దాల్చడంపై కూడా విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ విషయంపైనే తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ స్పందించారు.

Related posts