telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

మసూద్ పాకిస్తానీనే.. సాక్ష్యాలు ఇస్తే .. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. : పాక్

pak on masud and action on him

పాక్ విదేశాంగ మంత్రి షా మెహ్మూద్ ఖురేషీ, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్ పాకిస్థాన్ లోనే ఉన్నాడని తెలిపారు. సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం మసూద్ అజార్ పాకిస్థానీ జాతీయుడేనని చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగోలేదని… ఇంటి నుంచి కూడా కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాడని తెలిపారు.

మసూద్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదనే ప్రశ్నకు సమాధానంగా… ఉగ్రదాడికి పాల్పడినట్టు ఆధారాలను చూపితే, కోర్టు ముందు ఉంచి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఖురేషీ చెప్పారు. పాక్ లోని కొత్త ప్రభుత్వం కొత్త మైండ్ సెట్ తో పని చేస్తోందని… శాంతిని కోరుకుంటోందని తెలిపారు. దేశ ఆర్థి వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ లో గత 17 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధం కూడా అంతం కావాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.

Related posts