telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బీజేపీ గెలిచిన మత్తులోనే ఉంది.. : పాక్

against bjp trying to apply last weapon as mp resigns

భారత్‌తో స్నేహసంబంధాలను కొనసాగించేందుకు పాక్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంది. ఓవైపు పాక్ లో ఆర్ధిక సంక్షోభం మరోవైపు ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య ఆ దేశం ఏకాకిగా మిగిలి పోతున్న వైనం; ఈ రెండింటీ నేపథ్యంలో భారత్‌తో తిరిగి స్నేహాసంబంధాలను మెరుగు పరుచుకునేందకు పాక్ పలు ప్రయత్నాలను చేస్తుంది. భారత్ ఇందుకు నిరాకరించడంతో భారత్ పై విమర్శలకు దిగింది. పుల్వామా దాడి పరిణామాల తర్వాత పాకిస్థాన్‌ను ఒంటరీగా మారుతోంది. ఓ వైపు ఉగ్రవాదం మరోవైపు దేశ ఆర్ధిక సంక్షోభం పాకిస్థాన్‌ను ఒంటరీ చేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే భారత్‌తో ఉన్న వైరుధ్యాలను పక్కన బెట్టి స్నేహా హస్తాన్ని అందిస్తోంది.దీంతో రెండు దేశాల మధ్య స్నేహసంబంధాన్ని కొనసాగించడంతోపాటు ఉన్న సమస్యలను పరిష్కరించకునేందుకు చర్చలకు రావాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌కు లేఖ రాశారు. ఈనేపథ్యంలోనే కిర్గిస్థాన్‌లో కొనసాగుతున్న ఎస్‌సీఓ సమావేశాల్లోనే పాకిస్థాన్ ప్రధానితో ప్రధాని మోడీ సమావేశం అవుతారని వార్తలు వెలువడ్డాయి.

బిష్కేక్ సమావేశాల్లో చైనా ,రష్యాదేశాలతో సమావేశమైన మోడీ పాక్ ప్రధానితో చర్చలు జరిపేందుకు నిరాకరించారు. భారత్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ తిరిగి అధికారంలో రావడం వల్లే రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని స్వయంగా ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేశారు. తాజగా కిర్గిస్థాన్ వెళ్లిన ప్రధాని కనీసం పాక్ గగతలాన్ని కూడ ఉపయోగించుకునేందుకు నిరాకరించాడు. బిష్కేక్ సమావేశానికి వెళ్లడం కోసం భారత్ అధికారులు మూసిఉన్న పాక్ గగతలం గుండా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనితో ఆదేశం హూటాటిన అందుకు అంగీకరించింది. బాలకోట్ ఉదంతం తర్వాత మూసివేసిన మార్గం గుండా వెళ్లేందుకు అంగీకరించారు. కాని మోడీ మాత్రం ముందుకు అనుకున్న పాకిస్థాన్ మార్గం కాదని ఇరాన్ గుండా కిర్గిస్థాన్‌ సమావేశాలకు వెళ్లారు.

ప్రధాని మోడీ భారత్‌ స్సేహహస్తం కోసం ఉవ్విళ్లూరుతున్న పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు నిరాకరిస్తున్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపిన తర్వాతే పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తామని మోడీ స్సష్టం చేశాడు. ఈనేపథ్యంలోనే పాక్ భారత్ చర్యలపై ఘాటుగా స్పందించింది. భారత దేశానికి ఎన్నికల హ్యాంగోవర్ ఇంకా దిగలేదని పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్‌ ఖురేషీ భారత్‌పై విమర్శలకు దిగారు. భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నాము, భారత్ ఇలాంటీ చర్యలకు పాల్పడితే భారత్ మైత్రీ కోసం వెంపర్లాడేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.

Related posts