telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ దూకుడు వెనుక.. చైనా హస్తం.. ఈసారి చైనాకి తప్పని ఉగ్రముద్ర..

china disappointed pak in J & K issue

అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నా..పాక్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాశ్మీర్ విషయంలో భారత్ పై విషం చిమ్మాలని చూస్తూనే ఉన్నాడు. ఇమ్రాన్ మాత్రమే కాదు, ఆయన మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు, స్పీకర్లు కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ తో యుద్ధం తప్పదు అనే రీతిలో మాట్లాడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు భయభ్రాంతులను చేస్తున్నాయి. ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయని, యుద్ధం చేస్తే రెండు దేశాలకు ప్రమాదం అని, దాని వలన ప్రపంచంలోని చాలా దేశాలు ప్రభావితం అయ్యి దారుణ పరిస్థితులకు దారి తీస్తాయని అందుకే మొదట తమదేశం అణ్వాయుధాలను ప్రయోగించదని అంటున్నాడు. అయితే, కాశ్మీర్ విషయంలో తమ ఎదురుదాడి చేసి తీరుతామని మాట్లాడుతున్నాడు ఇమ్రాన్. ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అంటే అణ్వాయుధాలు ప్రయోగించకపోయినా.. దాడి చేయడం మాత్రం గ్యారెంటీ అనే రీతిలో మాట్లాడటం వెనుక ఉద్దేశ్యంఏంటి. పాక్ రైల్వే శాఖ మంత్రి రషీద్ చెప్పినట్టుగా అక్టోబర్ లో పాక్ తో యుద్ధం ఉంటుందా.. ఒకవేళ యుద్ధం తప్పనిసరైతే పాక్ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

పాక్ చేసిన వ్యాఖ్యల వెనుక చాలా అర్ధం ఉన్నది. ఇండియాపై ఒంటికాలితో రెచ్చిపోవడానికి కారణం చైనా అయిఉండవచ్చా. ఆ దేశం అండ చూసుకొని పాక్ ఇష్టానికి రెచ్చిపోతున్నది. చైనా చెప్పినట్టుగా పాక్ ఆడుతున్నది. ఏదైనా తేడా వస్తే.. పాక్ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది. మరోవైపు పాక్ లో ఉన్న హిందూ మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. మైనారిటీ ఆడపిల్లలను బలవంతంగా ఎత్తుకెళ్ళి మతం మార్చి వివాహం చేసుకుంటున్నారు. దీంతో అక్కడి మైనారిటీలు ఆందోళన చేస్తున్నారు. శాంతిని కోరుకునే దేశమైతే ముందు అక్కడి పరిస్థితులను చక్కబెట్టుకోవాలి.. ఆ తరువాత బయటి విషయాల గురించిమాట్లాడాలి. ఇవన్నీ పాక్ వ్యవహారశైలిలోనే తప్పిదం ఉందని, ఆ దేశం తీవ్రవాద ప్రేరేపిత దేశంగా కాకుండా, కావాలనే తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశంగా సుస్పష్టం అవుతుంది.

Related posts