telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా తరహా మరోదాడి.. పాక్..ఇంటెలిజెన్స్ హెచ్చరికలు..

pak intelligence warning on terrorist attack in J & k

భారత్ సహా అమెరికా, పాక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు జమ్మూ కాశ్మీర్ లో మరో ఉగ్రదాడి జరగవచ్చని హెచ్చరించాయి. కాశ్మీర్ లోని పుల్వామా మరియు అవంతిపోర జిల్లాల్లో ఈ దాడులు జరగవచ్చని ఇంటలీజన్స్ వర్గాలు హెచ్చారించాయి. ఈనేపథ్యంలోనే భద్రతా దళాలు కాశ్మీర్ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించాయి.. రాష్ట్రంలో సెక్యూరిటీ ఎజన్సీస్ అన్నింటిని అప్రమత్తం చేశాయి. కాశ్మీర్ లోని ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తీవ్రవాది జకీర్ మూస మృతికి నిరసనగా ప్రతికారదాడులకు తీర్చుకునేందుకు ఉగ్రవాద సంస్థలు సిద్దంగా ఉన్నాయనే సమాచారం.

కాశ్మీర్ తీవ్రవాదీ బుర్హాన్ వాణి ప్రధాన అనుచరుడు జకీర్ మూస మే 24న జరిగిన భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత పడ్డాడు. ఆ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మరోసారి ఉగ్రవాదులు పుల్వామా, మరియు అవంతిపోర జిల్లాలో గతంలో పుల్వామాలో జరిగిన వెహికిల్ ఐఈడీ దాడులు జరగవచ్చని ఇంటలీజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పాక్ సైతం ఈ సమాచారాన్ని ఇండియాకు చేరవేసినట్టు ఇంటలీజెన్స్ వర్గాలు తెలిపాయి. పాక్-ఇండియాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నడంతో అంతర్జాతీయ సమాజంలో సైతం పాక్ ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్నారనే అపవాదు ఎదుర్కోంటుంది. నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా పాక్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్టు చెబుతున్నారు.

Related posts