telugu navyamedia
telugu cinema news trending

ప్రభాస్ సాంగ్ కి … పాక్ హీరోయిన్ కూడా .. ఫిదా అయిపోయిందట..

pak heroin likes prabhas song

`సాహో` తో ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ అతి త్వరలో రానున్నాడు. ఈ చిత్రం కోసం చాలా కష్టపడినట్టే ఇప్పటివరకు విడుదల చేసిన సినిమా వార్తలు చుస్తే తెలుస్తుంది. ఇక ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. `బాహుబలి`తో ప్రభాస్ క్రేజ్ దేశాలు దాటింది. దీంతో ఆయన `సాహో` మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆగస్ట్ 15న సినిమా విడుదలకానుంది. సినిమా కొంత ప్యాచ్‌వర్క్ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.

ఇటీవల ప్రభాస్‌, శ్రద్ధాకపూర్ నటించిన `సయ్యా సైకో..` అనే పబ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ అల్ట్రామోడల్ సాంగ్‌కు తెలుగు, తమిళం కంటే హిందీలో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. తాజాగా పాక్ లో అప్‌కమింగ్ హీరోయిన్ మవ్రా హొకెన్ సయ్యా సైకో సాంగ్‌ను హ్యాష్ ట్యాగ్‌తో జత చేస్తూ ప్రబాస్‌.. అంటూ ట్వీట్ చేయడం విశేషం. ఈమె బాలీవుడ్‌లోనూ `సనమ్ తేరీ కసమ్` సినిమాలో నటించింది. మన పొరుగుదేశానికి చెందిన ఓ హీరోయిన్‌..అందులో పాక్ హీరోయిన్ `సాహో` సాంగ్ గురించి ప్రస్తావించడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Related posts

“కబాలి” దర్శకుడి అరెస్ట్ తప్పదా ?

vimala p

ఐపీఎల్ : అలవోకగా గెలిచిన చెన్నై.. రేపే తుది పోరు.. ముంబై vs చెన్నై..

vimala p

నెహ్రూ పై .. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన.. నటి పాయల్ రోహాత్గీ అరెస్ట్..

vimala p