telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బెంగుళూరు నడిరోడ్డుపై .. పాక్ జెండా.. పోలీసుల విచారణ..

pak flag on road of Bangalore city

సాఫ్ట్ వేర్ కు పెట్టింది పేరుగా ఉన్న బెంగుళూరు మహానగరంలో, ప్రధాన కూడలిలో పాక్ జండా చిత్రీకరించడం కలకలం రేపుతోంది. పుల్వామా ఘటనతో వేడిమీద ఉన్న దేశంలో ఇలాంటి ఘటనలు అధికారులను మరింతగా కలవరపరచుతున్నాయి. అయితే ఇది ఆకతాయిల పనా, లేక ఈ మధ్య ఏది బాగా వైరల్ అయినా దానితో పాపులారిటీ సంపాదించుకోవాలనే వారి పనా.. లేక పాక్ అభిమానుల పనా అనేదానిపై స్పష్టత లేకున్నా.. ఆ దిశగా అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. వివరాలలోకి వెళితే, నగరంలో నిత్యం వాహనాలు జనం రద్దీతో ఉండే బస వనబావి సర్కిల్‌ రోడ్డు పై గుర్తు తెలియని దుండగులు కొందరు పాకిస్తాన్‌ జెండాను చిత్రీకరించడం కలకలం రేపింది.

రోడ్డు పై చిత్రీంచిన జెండాను గుర్తును గమనించిన కొందరు స్థానిక పోలీ సులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్క డికి చేరుకున్న మార్కేట్‌ యార్డ్‌ పోలీసులు ఇందుకు బాధ్యులేవ్వర న్నదాని పై ఆరా తీసేందుకు సిద్దమైయ్యారు. ఈ సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరా పని చేయకపోవడంతో నిందితులు ఎవ్వరన్నది గుర్తించలేకపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నగరంలోని ప్రధాన రోడ్డు కూడలిలో పాకిస్తాన్‌ జెండాను చిత్రీకరించడంతో పోలీసులు అప్రమత్తమై నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

Related posts