telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

పాక్ క్రికెట్ : .. కొత్త కోచ్ ను వెతుకులాట … మిక్కీ తొలగింపు…

pak cricket board will change coach

ప్రపంచ కప్ లో పేలవ ప్రదర్శనతో త్వరగానే ఇంటిబాట పట్టిన పాక్ క్రికెట్ జట్టుకు కోచ్ గా మిక్కీ ఆర్ధ‌ర్‌ వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా అత‌ని కాంట్రాక్టును ర‌ద్దు చేసుకోవాల‌ని పాక్ క్రికెట్ బోర్డు నిర్ణ‌యించింది. కోచ్ ఆర్థ‌ర్‌తో పాటు స‌పోర్ట్ స్టాఫ్‌ను కూడా తొల‌గించే ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవ‌ల ముగిసిన వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాక్ టీమ్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన నేప‌థ్యంలో పీసీబీ ఈ నిర్ణ‌యం తీసుకోనున్న‌ది.

మిక్కీ కాంట్రాక్టును రెన్యూవ‌ల్ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించిన పీసీబీ.. త్వ‌ర‌లో కొత్త కోచ్ కోసం రిక్రూట్మెంట్ ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ది. కోచ్ ఆర్థ‌ర్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లావ‌ర్‌, బౌలింగ్ కోచ్ అజ‌ర్ మొహ్మ‌ద్‌, ట్రైన‌ర్ గ్రాంట్ లూడెన్ స్థానాల్లో కొత్త వారిని తీసుకోనున్నారు.

Related posts