telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తెరుచుకున్న .. పాక్ గగనతలం ..

pak air base open to all announced

పాక్ లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత తమ గగనతలాన్ని మూసేసిన విషయం తెలిసిందే. తాజాగా, తమ గగనతలం మీదుగా అన్ని పౌరవిమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్టు పాక్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది. తక్షణమే ఇది అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. తమ ఎయిర్‌బేస్‌ల నుంచి భారత్ జెట్ యుద్ధ విమానాలను ఉపసంహరించుకునే వరకు వాణిజ్య విమానాలకు అనుమతి ఇవ్వబోమని అంతకుముందు పాక్ ప్రకటించింది.

నియంత్రణ రేఖకు ఆవల బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై, పుల్వామా దాడికి ప్రతీకారంగా, ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేసింది. ఈ దాడి తర్వాత పాక్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో మూసివేసిన 11 వాయుమార్గాల్లో ఒక దానిని తెరిచింది. మార్చిలో పాక్షికంగా వాయుమార్గాలను తెరిచినప్పటికీ భారత విమానాలను అనుమతించలేదు. తాజాగా, అన్ని మార్గాలను తెరిచినట్టు ప్రకటించింది.

Related posts