telugu navyamedia
సినిమా వార్తలు

అభినందన్ విడుదలపై పాక్ నటుడి కామెంట్స్

Jamal-Shah

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో భారత పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈరోజు స్వదేశానికి చేరుకోనున్న అభినందన్ విడుదల కోసం భారతీయులు ఎంతగానో ప్రార్థించారు. అయితే అభినందన్ విడుదలను భారతీయులతో సహా పాకిస్తాన్ ప్రజలు కూడా కోరుకున్నారని పాక్ నటుడు, దర్శకుడు జమాల్ షా అనడం గమనార్హం.

“మా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థానంలో నేను ఉన్నా అదే పని చేసేవాడిని. పాకిస్తాన్ లో మెజారిటీ ప్రజలు భారత పైలెట్ ను విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రజల సెంటిమెంటును గౌరవించే ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పటికే పాకిస్తాన్ లో డెబ్భై శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువ స్థానంలో బతుకుతున్నారని, యుద్ధం ఎఫెక్ట్ వస్తే పాక్ ప్రజల పరిస్థితి మరింత దిగజారేదంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. అంతేకాదు కళలు, సంస్కృతి ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి తోడ్పడతాయని, సంగీతం, సినిమా ఇలా ఎన్నో మాధ్యమాల కారణంగా భారత్-పాకిస్తాన్ మానసికంగా ముడిపడిపోయాయని, శాంతి చర్చలకు అవకాశం దొరికితే పొరుగుదేశం నటులతో మా అనుబంధం మరింత దృఢపడుతుందని నమ్మకం ఉందని భారత్ లో పాకిస్తాన్ నటులను బ్యాన్ చేయడంపై జమాల్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts