telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

యూట్యూబ్ ఘోరం.. నొప్పిలేకుండా చావడం ఎలా అనేది సెర్చ్ చేసి మరి.. ఆత్మహత్యలు..

youtube logo

నేటి బిజీ జీవితంలో ఎవరికి కాస్త తీరిక ఉన్నా లేక ఏది అవసరం అయినా తక్షణమే యూట్యూబ్ ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సినవి చూస్తుంటారు లేదా నేర్చుకుంటారు. ప్రతి దాని వలన లాభనష్టాలు రెండు ఉంటాయన్న విషయం అక్షరసత్యం. అలాగే ఈ యూట్యూబ్ కూడా ఎంతో మందికి ఉపయుక్తంగా ఉన్నప్పటికీ కొందరికి మాత్రం చేదుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికే ఈ యూట్యూబ్ చూసి నేరాలు చేయడం నేర్చుకుంటుంది యువత, అలాగే అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఆలవాలం అవుతుంది. తాజాగా ఒక యువకుడు యూట్యూబ్ చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటువంటి వీడియోలు అప్లోడ్ కాకుండా సంస్థ చూసుకొంటే ఆ మచ్చ కూడా లేకుండా గొప్పగా ఉపయుక్తంగా యూట్యూబ్ ఉండిపోతుంది.

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు నొప్పిలేండా ఎలా ఆత్మహత్య చేసుకోవాలనే విషయంపై యూట్యూబ్‌లో వీడియోలు చూసి, బలవన్మరణానికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన లెక్కల రామచంద్రుడు(35) నాలుగేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో మరుగుదొడ్డిలోకి వెళ్లి మెడ, చేతులపై చాకుతో కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు అతని సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. నొప్పి లేకుండా మరణించడం ఎలా అనే విషయంపై యూట్యూబ్‌లో నాలుగు రోజులుగా వీడియోలు వీక్షించినట్లు తేలింది.

Related posts