telugu navyamedia
క్రీడలు వార్తలు

స్మిత్ కెప్టెన్సీకి నేను మద్దతిస్తాను : పైన్‌

2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని స్మిత్‌ కెప్టెన్సీ పగ్గాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. స్మిత్‌తో పాటు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై కూడా ఒక ఏడాది నిషేధం పడిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీని తిరిగి స్టీవ్‌ స్మిత్‌కు అప్పగిస్తానని ప్రస్తుత సారథి టిమ్‌ పైన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘కెప్టెన్సీ విషయంలో కచ్చితంగా నేనా నిర్ణయం తీసుకోలేను. కానీ స్మిత్‌ సారథ్యంలో నేను ఆడినప్పుడు అతడు అద్భుతమైన సారథిగా ఉన్నాడు. నైపుణ్యం పరంగానూ చాలా మంచి ఆటగాడు. స్మిత్‌ కూడా నాలాంటి వాడే. తస్మానియా జట్టుకు నేను కెప్టెన్‌గా కొనసాగుతున్న తొలి నాళల్లో అతడు జాతీయ జట్టుకు కెప్టెనయ్యాడు. అదీ చాలా చిన్న వయసులో. అప్పుడు దానికి అతడు సిద్ధంగా లేడు. తర్వాత నేను జట్టులోకి వచ్చేసరికి ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎంతో మెరుగయ్యాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని కెప్టెన్సీకి దూరమయ్యాడు. అయితే తిరిగి అతడు కెప్టెన్సీ పగ్గాలు చేపడితే నేను మద్దతిస్తాను’ అని టిమ్‌ పైన్‌ అన్నాడు.

Related posts