telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక సినిమా వార్తలు

పద్మ పురస్కారాలను ప్రకటించిన.. కేంద్రం..

padma awards 2019 released

వివిధ రంగాలలో అత్యున్నత సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా నేడు పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి పద్మ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో ప్రముఖంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), అస్సామీ జానపద గాయకుడు భూపేన్ హజారికా (మరణానంతరం)లకు కేంద్రం భారతరత్న ప్రకటించింది.

భారతరత్న తర్వాత అత్యున్నత పురస్కారంగా పరిగణించే పద్మవిభూషణ్‌కు టీజెన్‌బాయ్‌, అనిల్‌కుమార్‌ మణీబాయ్‌, ఇస్మాయిల్‌ ఒమర్‌ గులే, బల్వంత మోరేశ్వర్‌ పురంధేరలు ఎంపికయ్యారు. 14 మందికి పద్మ భూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.

ఈ అవార్డుకు తెలంగాణ నుంచి సునీల్ ఛెత్రి(క్రీడలు-ఫుట్‌బాల్), సిరివెన్నెల సీతారామ శాస్త్రి(సినీ గీత రచయిత) ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కోటాలో యడ్లపల్లి వెంకటేశ్వరరావు(వ్యవసాయరంగం), ద్రోణవల్లి హారిక (క్రీడలు-చెస్) ఈ అవార్డుకు ఎంపికయ్యారు. జుగాడ్ విధానంలో వినూత్న ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్త ఉద్ధవ్ కుమార్ భరలీకి కూడా పద్మశ్రీ ప్రకటించారు.

‘ఆశా ఓ ఆశ్వాసన్’ పేరుతో స్కూలు ప్రారంభించి, మురికివాడల్లోని పిల్లలకు విద్యను చేరువ చేసిన చాయ్ వాలా దేవరపల్లి ప్రకాశ్ రావును కూడా పద్మ అవార్డు వరించింది.

ఇంకా క్రికెటర్ గౌతం గంభీర్, సినీ నటులు మోహన్ లాల్, మనోజ్ బాజ్‌పాయ్, ప్రభుదేవా, ఖాదర్ ఖాన్(మరణానంతరం), సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్‌లను కూడా పద్మశ్రీ వరించింది.

పద్మ అవార్డుల జాబితా…2019AwardeesList

Related posts