telugu navyamedia
సినిమా వార్తలు

మహర్షి : పాలపిట్ట… వీడియో సాంగ్

Maharshi

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన “మ‌హ‌ర్షి” చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నసంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో పెద్దగా సినిమాలు లేక‌పోవ‌డంతో ఈ చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌డుతుంద‌ని అంచనా వేస్తున్నారు సినిమా విశ్లేషకులు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర పోషించాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్ర సక్సెస్ మీట్ వేడుక‌ల‌లో పాల్గొన్న మ‌హేష్ త‌న ఫ్యామిలీతో కలిసి విహార యాత్ర‌కి వెళ్ళాడు. తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా మొదలుపెట్టనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “పాలపిట్ట…” అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను రాహుల్ సింప్లిగంజ్, ఎంఎం మానసి పాడగా… శ్రీమణి లిరిక్స్ అందించారు. ఈ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts