telugu navyamedia
సినిమా వార్తలు

మహర్షి : “పాలపిట్ట” మేకింగ్ వీడియో

Maharshi

సూపర్ స్టార్ మ‌హేష్ బాబుహీరోగా వంశీ పైడిప‌ల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మ‌హ‌ర్షి”. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర పోషించాడు. వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండు వంద‌ల కోట్ల మార్క్ ద‌గ్గ‌ర‌కి చేరుకున్న ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో మ‌హ‌ర్షిని మించిన సినిమా లేక‌పోవ‌డంతో ఈ చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌డుతుంద‌ని అంటున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలోని “పాల పిట్ట” సాంగ్‌ మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియో సూపర్ స్టార్ అభిమానుల‌ని అల‌రిస్తుంది. మహేష్ త్వ‌ర‌లో అనీల్ రావిపూడితో క‌లిసి త‌న 26వ సినిమా చేయ‌నున్నాడు మ‌హేష్.

Related posts