telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఇక్కడ ప్రజలు బ్రతికి ఉన్నంతకాలం కలిసే ఉంటారు.. అది చూసి మీరు ఓర్వలేకపోతే.. మా సమస్య కాదు..: ఒవైసీ

oyc president on congress-tdp alliance

ఎంఐఎం అధినేత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పుల్వామా దాడికి మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయని అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్థాన్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా పాక్‌ ప్రధాని అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. ”కెమెరాల ముందు కూర్చొని భారత్‌కు నీతి వ్యాఖ్యాలు బోధించొద్దు. ఈ దాడి మొదటిది కాదు. ఇప్పటికే పఠాన్‌కోట్‌, ఉరీ ఘటనలు జరిగాయి. భారత్‌ తరఫున నేను పాక్‌ ప్రధానికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికైనా అమాయకత్వపు ముసుగు తొలగించండి” అని ఓవైసీ అన్నారు. భారత ముస్లింల గురించి పాక్‌ ఆలోచించొద్దన్నారు. 1947లోనే భారత్‌ను ఇక్కడి ముస్లింలు సొంత దేశంగా భావించారన్నారు.

భారత దేవాలయాల్లో గంటలు మోగనివ్వం అని పాక్‌కు చెందిన ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ఓవైసీ దీటైన సమాధానమిచ్చారు. ”మీకు భారత్‌కు గురించి తెలియదు. భారత్‌లో ముస్లింలు బతికున్నంత కాలం మసీదుల్లో ఆజాన్‌.. దేవాలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయి. ఇక్కడి ప్రజలు బతికున్నంత కాలం కలిసే ఉంటారు. దీన్ని పాక్‌ ఓర్వలేకపోతోంది” అని ఓవైసీ అన్నారు. పాకిస్థాన్‌ ప్రభుత్వం, సైన్యం, ఐఎస్‌ఐ కలిసే పుల్వామా దాడిని జరిపాయన్నారు. ఓ మహ్మద్‌.. వ్యక్తి ప్రాణాల్ని బలితీసుకోడన్నారు. జై షే మహమ్మద్‌ సంస్థను జై షే సైతాన్‌గా ఆయన అభివర్ణించారు. అలాగే దాడికి ఇంటెలిజెన్స్‌ లోపం కూడా ఓ కారణమన్నారు.

Related posts