telugu navyamedia
సినిమా వార్తలు

8 ఏళ్ళ తరువాత మాతృభాషలోకి హీరోయిన్ రీఎంట్రీ

Oviya,Simbu,90ml Movie allegations

బిగ్ బాస్ బ్యూటీ, కోలీవుడ్‌ నటి ఓవియా తమిళ బిగ్‌బాస్‌ షో హౌస్‌లో సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. ఓవియాకు బిగ్ బాస్ తో భారీ క్రేజ్ లభించింది. ఈ షోలో పాల్గొని బుల్లితెర అభిమానులను సంపాదించుకుని ఓవియా ఆర్మీ అనే పేరుతో సంచలనం సృష్టించింది. ఆ క్రేజ్ తోనే ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈమె తన మాతృభాష మళయాలంలో నటించేందుకు నిర్ణయించుకుంది. తొమ్మిదేళ్ళ తరువాత ఆమె నటించనున్న ‘బ్లాక్‌ కాఫీ’ చిత్రానికి బాబురాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఓవియా మాట్లాడుతూ ‘ఇది ఒక లవ్‌ స్టోరీ ఇందులో యాడ్‌ ఫిల్మ్‌ మోడల్‌గా నటిస్తున్నా, ఈ చిత్రం ద్వారా మళయాల పరిశ్రమలో నిలదొక్కుకుంటా’ అని తెలిపింది. “కంగారు” అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఓవియా, కోలీవుడ్‌లో “కలవాణి”తో ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలంగా తమిళ సినిమాకే ఈ అమ్మడు పరిమితమైంది. 2011లో “మనుష్యమృగం” తర్వాత మరో మలయాళ చిత్రంలో నటించలేదు. మరి ఇప్పటికైనా ఓవియా తన మాతృభాషలో మంచి ప్రేక్షకాదరణను పొంది మలయాళ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుందేమో చూడాలి.

Related posts