telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

అతినిద్ర కూడా .. అనారోగ్యమే.. !

over sleep is also unhealthy

సాధారణంగా అలసిపోతే నిద్ర పోవడం తో మళ్ళీ ఉత్సాహాన్ని పొందుతాము. అందుకే ప్రతిరోజూ ఆయా వయసును, వారు చేసే శ్రమను బట్టి నిద్ర సమయం నిర్ణయించబడతాయి. రోజు పునరుత్తేజాన్ని పొందటానికి తగిన నిద్ర అవసరం. నిద్ర సమయం ఎక్కువైనా కూడా మళ్ళీ ఆరోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. సరిపడా నిద్ర పోయినప్పుడు శ‌రీరం పున‌రుత్తేజం చెందుతుంది. క‌ణజాలం మ‌ర‌మ్మ‌త్తు అవుతుంది. కొత్త శ‌క్తి వ‌స్తుంది. అందుకే ఎవ‌రైనా నిత్యం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవాల‌ని వైద్యులు చెబుతుంటారు.

కొంద‌రు ఈ స‌మ‌యం పాటించ‌రు. చాలా త‌క్కువ గంట‌లు నిద్రిస్తారు. ఇక కొంద‌రైతే ఏకంగా 10 గంట‌ల పాటు రోజూ నిద్రిస్తుంటారు. నిజానికి నిద్ర త‌క్కువ అయితే ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో, నిద్ర మ‌రీ ఎక్కువ‌గా పోయినా అవే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

10 గంట‌లు నిద్రించే వారికి డ‌యాబెటిస్‌, స్థూల‌కాయం, త‌ల‌నొప్పి, వెన్ను నొప్పి, డిప్రెష‌న్‌, గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించే వారితో పోలిస్తే 10 గంట‌ల క‌న్నా ఎక్కువగా నిద్రించే వారికే అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని వారు అంటున్నారు. రోజూ త‌గిన‌న్ని గంట‌లే నిద్రించాల‌ని వైద్యులు కూడా చెబుతున్నారు.

రోజూ 10 గంట‌ల క‌న్నా ఎక్కువ‌గా ఎవ‌రైనా నిద్రిస్తుంటే.. వెంట‌నే వారు త‌మ అల‌వాటును మానుకోవ‌డం ఉత్త‌మం. లేదంటే పైన చెప్పిన అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న‌వార‌వుతారు..!

Related posts