telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఉప్పు పాళ్ళు ఎక్కువైతే .. చేటే .. అదెలాగంటె..!

over salt causes health issues

నిత్యం అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసుకుని తింటుంటాం.. అందులో ఉప్పు ఉండాల్సిందే. లేకపోతే రుచి లేదని ఎంత ఇష్టమైన పదార్థమైనా చెత్తలో పడేయమంటారు. చాలా మంది కేవ‌లం రుచి కోస‌మే ప‌లు వంట‌కాల‌ను చేసుకుని వాటిని ఆస్వాదిస్తుంటారు. అయితే చాలా వ‌ర‌కు వంట‌కాలు ఏవైనా స‌రే.. ఉప్పు లేకుండా వాటికి రుచికి రాదు. తీపి వంట‌కాల సంగ‌తి ప‌క్క‌న పెడితే మిగిలిన కూర‌లు, ఇత‌ర ఏ వంట‌కంలో అయినా స‌రే.. ఉప్పు త‌గినంత ప‌డాల్సిందే. కానీ అదికూడా త‌గినంత తింటే మ‌నకి ఆరోగ్యం, లేదంటే చేటే అంటున్నారు నిపుణులు. ఉప్పు మోతాదు మించితే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు .. బీపీ, హార్ట్ ఎటాక్‌, కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం మ‌నం త‌గినంత మోతాదు క‌న్నా ఎక్కువ ఉప్పు తింటే మ‌న శ‌రీరమే మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంటుంది. వాటిని బ‌ట్టి మ‌నం ఉప్పు ఎక్కువ‌గా తింటున్నామ‌ని తెలుసుకోని, ఆ మేర ఆహారంలో ఉప్పు త‌గ్గించాలి. మ‌రి మ‌నం ఉప్పు ఎక్కువ‌గా తింటున్నామ‌ని తెలిపే ఆ ల‌క్ష‌ణాలు ఏమిటో తెలుసుకుందాం..!

* ఉప్పు ఎక్కువ‌గా తింటే రోజులో మూత్ర విస‌ర్జ‌న‌కు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వ‌స్తుంది. ఉప్పులో ఉండే సోడియంను శ‌రీరం బ‌య‌ట‌కు పంపేందుకు నీటిని ఎక్కువ‌గా ఉప‌యోగించుకుంటుంది. అందుక‌ని మ‌న‌కు త‌ర‌చూ మూత్రం వ‌స్తుంది. మీకు గ‌న‌క డ‌యాబెటిస్ లేన‌ట్ల‌యితే, మూత్ర విస‌ర్జ‌న ఎక్కువ‌గా అవుతున్న‌ట్ల‌యితే.. అప్పుడు మీరు ఉప్పు ఎక్కువ‌గా తింటున్నార‌ని అర్థం చేసుకోవాలి. ఆ మేర ఆహారంలో ఉప్పు శాతాన్ని త‌గ్గించుకుంటే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

* ఉప్పు ఎక్కువ‌గా తింటే మూత్ర విస‌ర్జ‌న ఎక్కువ‌గా చేస్తాం క‌నుక‌, దాహం కూడా మ‌న‌కు ఎక్కువ‌గా వేస్తుంది. కనుక ఈ ల‌క్ష‌ణం క‌నిపిస్తున్నా మీరు ఉప్పు ఎక్కువ‌గా తింటున్నార‌ని అర్థం చేసుకోవాలి.

* ఉప్పు ఎక్కువ‌గా తినేవారి శ‌రీరంలో వాపులు వ‌స్తాయి. ముఖ్యంగా కాలి మ‌డ‌మ భాగంలో ఉబ్బుతుంది. అక్క‌డ వేలితో ట‌చ్ చేస్తే చ‌ర్మం లోప‌లికి పోతుంది. దానికి కార‌ణం ఆ భాగంలో నీరు ఎక్కువ‌గా చేర‌డ‌మే. ఉప్పు ఎక్కువ‌గా తినేవారిలో ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంది. దీన్నే ఎడిమా అని కూడా అంటారు. ఆహారంలో ఉప్పు త‌గ్గిస్తే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

over salt causes health issues* ఉప్పు బాగా తింటే నాలుక‌పై ఉండే రుచి క‌ళిక‌లు ఇత‌ర రుచుల‌ను గుర్తించ‌లేవు. ఫ‌లితంగా ఏది తిన్నా స‌హించ‌దు. ఉప్పు ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాల‌నే తినాల‌ని యావ ఉంటుంది. ఈ స‌మ‌స్య ఉంటే మీరు ఉప్పు ఎక్కువ‌గా తింటున్నార‌ని అర్థం చేసుకోవాలి.

* ఉప్పు ఎక్కువ‌గా తినేవారి శ‌రీరంలో నీరు త్వ‌ర‌గా అయిపోతుంది. ఫ‌లితంగా డీహైడ్రేష‌న్ బారిన ప‌డి త‌ల‌నొప్పి వ‌స్తుంది. క‌నుక ఆహారంలో ఉప్పు త‌గ్గించాలి. ముఖ్యంగా ఈ వేస‌విలో శ‌రీరం సహ‌జంగానే డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతుంది. ఇక ఉప్పు అధికంగా తింటే త్వ‌ర‌గా డీహైడ్రేష‌న్ బారిన ప‌డి, త‌ద్వారా ఎండ‌దెబ్బ‌కు గుర‌య్యే చాన్స్ ఉంటుంది. క‌నుక ఉప్పు త‌గ్గిస్తే మంచిది.

Related posts