telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

అధిక వేడి కూడా .. సంతానలేమికి కారణం .. దానికి విరుగుడు ఇదే..

over heat food also reason for sexual disorders

సమయసమయాలు లేకుండా ఆహారం తీసుకోవడం, ఆ తిన్నది కూడా ఏది దొరికితే అది తీసుకోవడం సహజంగా ఇప్పటి కాలంలో జరుగుతున్న ప్రక్రియ. దీనితోనే అనేకానేక సమస్యలు తలెత్తుతున్నాయి.. అందులో సంతానలేమి ప్రధానంగా ఉంటుంది.

ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా ఏదోకటి తినేస్తే, శరీరం లో అధిక వేడి కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా వృషణాలలో బాగా వేడి కలగడం, శుక్ర కణాలు నశించిపోవడం లాంటివాటికి దారితీస్తుంది. ఇటువంటి వారికి సంతానం కలుగకపోవడానికి అవకాశాలు ఎక్కువే అంటున్నారు నిపుణులు.

దీనికి విరుగుడుగా ఆయుర్వేదంలో స్వర్ణవంగభస్మ, త్రివంగ భస్మ, రజత చంద్రోదయం, శతావరికల్పం, బూడిదగుమ్మడి రసం, కూష్మాండరసాయనం, ఆమల రసాయనం, అరటిపండు, బాలింతబోలు, ముల్లంగిరసం, మంచిగంధం, వేపవేళ్లు..వంటివి చెప్పబడ్డాయి. ఇవన్నీ వృషణాలలో వేడిని తగ్గించేవే.

ఆహారంలో స్వల్ప మార్పులతో సంతానలేమి సమస్యను సులువుగా అధిగమించవచ్చు. తద్వారా వీర్యవృద్ధి, శుక్రకణాల వృద్ధి చేకూరుతుంది. శరీరానికి కూడా చలువచేసే కరుబూజపండు, సొరగింజలు, గుమ్మడిగింజలు, దోసగింజలు కూడా మేలు చేస్తాయి. బూడిద గుమ్మడికాయను హల్వాలా చేసుకుని తింటే బాగా చలువ చేస్తుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.

Related posts