telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

మేడ్చల్‌ : … వైద్య, ఆరోగ్య శాఖలో … ఉద్యోగాల భర్తీకి .. నోటీఫికేషన్‌ విడుదల …

funds to telangana by central govt

జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్‌ను విడుదల చేసింది. మెడికల్‌ ఆఫిసర్‌ పోస్టులు మూడు, ల్యాబ్‌ సూపర్‌వైజర్‌ ఒకటి, హెల్త్‌ విజిటర్స్‌ మూడు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ రెండు పోస్టులు ఉన్నాయిని, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు.

మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ బి బ్లాక్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈ నెల 30న మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు, అక్టోబర్‌ 3న ల్యాబ్‌ సూపర్‌వైజర్‌, హెల్త్‌ విజిటర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌లకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అన్నారు. అభ్యర్థులు విద్యార్హత పత్రాలతో (ఒర్జినల్‌, జిరాక్స్‌) హాజరుకావాలని కోరారు.

Related posts