telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

కేబుల్, డీటీహెచ్ ల.. స్థానంలో కొత్త టెక్నాలజీ.. ఓటీటీ..

OTT will replace cable and DTH

టెక్నాలజీ అంటేనే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మరి అలాంటి టెక్నాలజీ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవటం కూడా అవసరం. లేదంటే, వెనకబడిపోయినట్టే. దీనిలో ఇంకో బాధాకరమైన విషయం ఏమంటే, కొత్త టెక్ రాగానే, పాతవి కనిపించకుండా పోతున్నాయి. దీనితో పాతదానితో సరిపొట్టుకుందామన్నా కూడా కుదరటంలేదు. ఇప్పుడు ఉన్న కేబుల్ కు ఆ పరిస్థితి వచ్చేసింది. దాని స్థానంలో డీటీహెచ్ వచ్చేసింది. ఇక స్మార్ట్ మొబైల్, టీవీ లతో అది కూడా పాతదైపోతుంది. తాజాగా, సినిమాలను, టీవీ చానళ్లను ఇంట్లో టీవీలో ప్రసారం చేసే కొత్త టెక్నాలజీ ‘ఓటీటీ’ ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం మన ఇంట్లో ఉన్న టీవీలు కేబుల్‌ కలెక్షన్స్‌ లేదా ఇంటిపై పెట్టుకున్న డీటీహెచ్‌ ద్వారా ప్రసారాలు అందుకుంటున్నాము. ఇదే స్థానంలో నెట్ ద్వారా మనం చూడాలనుకున్న చానల్‌గానీ, సినిమాగానీ చూసుకునే వీలును కల్పించే ‘ఓటీటీ’ సర్వీసును అందించేందుకు రంగంలోకి దిగిపోయాయి పలు కంపెనీలు.

ఈ టెక్నాలజీ ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో అమలు చేస్తున్నారు. మన దేశంలో ఇంటర్నెట్‌ వాడకం ఊపందుకోవడంతో ‘ఓటీటీ’ టెక్నాలజీ ప్రారంభమైంది. అయితే మన దేశంలో ఇంకా స్మార్ట్‌ టీవీలు ఎక్కువ లేవు. అయినా కూడా ఇండియాలో ఈ బిజినెస్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముంబయి, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలోల ఈ సర్వీస్‌ మొదలైంది. ప్రధానంగా హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌, ఎరోస్‌ నౌ తదితర సంస్థలు ఈ సేవలందిస్తున్నాయి. సౌతిండియాలోనే తొలిసారిగా ఓటీటీ సర్వీసును అందించేందుకు రంగంలోకి దిగిపోయింది SMARTMULTIPLEX.COM . అంతేకాదు స్మార్ట్ మల్టీప్లెక్స్ సంస్థ ప్రస్తుతం ఉచితంగా సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇందులో లోకల్ కంటెంట్‌ను అందుబాటులో ఉంచింది. ఈ బిజినెస్‌లోకి నిమ్మగడ్డ ప్రసాద్‌, అల్లు అరవింద్‌, మై హోమ్‌ అధినేత రామేశ్వరరావు.. వంటి వారు ఎంటరవుతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రానున్న దశకంలో ఖచ్చితంగా కేబుల్‌, డీటీహెచ్‌ సగానికి పడిపోతాయి అనేది మార్కెట్‌ విశ్లేషకుల అంచనా. రానున్న ఐదు సంవత్సరాల్లో డిష్, కేబుల్స్ పోయి ఎక్కువ శాతం ‘ఓటీటీ’ని వాడతారనే అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తానికి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ అనే కొత్త విప్లవానికి తెరలేస్తోందన్నమాట.

Related posts