telugu navyamedia
సినిమా వార్తలు

అందుకే ఇండియన్ సినిమాలకు ఆస్కార్ ఇవ్వట్లేదు… ఆస్కార్స్ అకాడమీ అధ్యక్షుడు

Oscar

ఆస్కార్స్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బెయిలీ తన సతీమణి కరోల్ తో కలసి తాజాగా ఇండియాలో పర్యటించారు. ముంబయిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతీయ చిత్రాలు ఎందుకు ఆస్కార్ అవార్డు గెలుచుకోలేకున్నాయో వివరించారు. ఇప్పటి వరకు ఒక్క ఇండియన్ మూవీకి కూడా ఆస్కార్ ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకు బెయిలీ స్పందిస్తూ మాకు భారతీయ చిత్రాల గురించి ఎలాంటి విషయాలూ తెలియడం లేదు. అందుకే ఆస్కార్ అవార్డు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పాడు. ఇందులో మా తప్పేమి లేదు. ప్రపంచం మొత్తానికి తెలిసేలా ఇండియన్ దర్శకులు, నిర్మాతలు ఒక్క చిత్రం కూడా చేయలేకపోయారు అని బెయిలీ చురకలంటించారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పది. ఇక్కడి విభిన్న ఆచారాలు, సంస్కృతులు గురించి ఎన్నో మంచి విషయాలు విన్నా. కానీ భారతీయ సంస్కృతులని ప్రతిభించిందే చిత్రం ఒక్కటి కూడా మా వరకు చేరలేదు. సంస్కృతులు, విలువలు ఉన్న చిత్రాలకే ఆస్కార్స్ లో ప్రాధాన్యత ఉంటుందని బెయిలీ అన్నారు. మీ గురించి ప్రపంచానికి తెలిసేలా చేయాల్సిన భాద్యత మీ దర్శకులదే అని బెయిలీ సూచించారు. ఇండియాలో ఏడాదికి 1800 సినిమాలు నిర్మించబడుతున్నాయి. హాలీవుడ్ కంటే నాలుగురెట్లు ఎక్కువ. ఆస్కార్ అవార్డులు కేవలం హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే కాదు. ప్రపంచానికి తెలిసేలా సినిమా చేస్తే ఇండియన్ చిత్రాలకు కూడా ఆస్కార్ అవార్డు వస్తుంది అంటూ ఇండియన్ దర్శకులకు బెయిలీ పరోక్షంగా చురకలు అంటించారని చెప్పొచ్చు.

Related posts