telugu navyamedia
సినిమా వార్తలు

“వాల్మీకి” సెట్లో ఆస్కార్ అవార్డు గ్రహీత…!!

Valmiki

హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా జిగర్తాండకు ఈ సినిమా రీమేక్. ఈ సినిమాలో తమిళ్ హీరో అథర్వ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్. తాజాగా “వాల్మీకి” సినిమా షూటింగ్ లో వరల్డ్ లో ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన రిచర్డ్ సన్ కన్పించారు. ఆయన హరీష్ శంకర్ తో కలిసి ఒక షాట్ ను చిత్రీకరించారు కూడా. “వాల్మీకి” సెట్ లో సందడి చేస్తూ చిత్ర యూనిట్ సభ్యులను హ్యాపీగా పలకరించారు. రిచర్డ్ సన్ మూడు సార్లు ఆస్కార్ బరిలో విజేతగా నిలిచాడు. జె ఎఫ్ కె (1991), ది ఏవియేటర్ (2004), హ్యూగో (2011) వంటి సినిమాలకు పని చేసిన ఆయన బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా ఆస్కార్స్ అందుకున్నారు. ఇక అలాంటి ప్రముఖ టెక్నీషియన్ “వాల్మీకి” షూటింగ్ లో పాల్గొనడం హ్యాపీగా ఉందని దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

Related posts