telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆస్కార్ 2020 : ఉత్తమ సహాయనటిగా లారా డెర్న్

Lara

ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక లాస్‌ ఏంజిలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతుంది. ఈ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటిగా.. లారా డెర్న్ అవార్డు దక్కించుకున్నారు. “మ్యారేజ్ స్టోరీ” సినిమాలో ఆమె నటనకు గాను ఇప్పుడు ఆమెను అవార్డు వరించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కూడా ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డు దక్కించుకోగా.. ఇప్పుడు ఆస్కార్ ఆమెను వరించింది. ఇప్పటివరకు లారా డెర్న్ మూడు సార్లు ఆస్కార్ కు నామినేట్ అవగా.. ఫస్ట్ టైమ్ ఆమెను అవార్డు వరించింది. ఆమె గతంలో 2015 లో “వైల్డ్” మరియు 1992 లో “రాంబ్లింగ్ రోజ్” సినిమాలకు ఆమె నామినేట్ చేయబడింది. డెర్న్ ఈ అవార్డు సీజన్లో ఆధిపత్యం చెలాయించింది, గోల్డెన్ గ్లోబ్స్ మరియు బాఫ్టాతో సహా ప్రధాన అవార్డు షోలలో సహాయ నటి అవార్డులను ఆమె గెలుచుకున్నారు.

Related posts