telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ దర్శకుడి .. రెండో చిత్రం..ధ‌మాకా ఫస్ట్ లుక్ ..

oru aadar love director next project first look

ఒరు అదార్ లవ్ చిత్రం తో ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ అబ్దుల్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన చిత్రం తెలుగులో లవర్స్ డే పేరుతో విడుద‌లై విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఒమ‌ర్ లులు తెర‌కెక్కించాడు. ఈ చిత్రంలోని ఓ సీన్‌తో ప్రియా ప్రకాశ్ వారియ‌ర్ ఓవ‌ర్ నైట్ స్టార్ అయింది. అయితే చిత్రం మాత్రం ప్రేక్ష‌కుల‌ని పెద్ద‌గా అలరించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం ఒమ‌ర్ లులు తన త‌ర్వాతి చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌ని రిలీజ్ చేస్తూ టైటిల్ ప్ర‌క‌టించాడు.

ధ‌మాకా అనే టైటిల్‌తో ఒమ‌ర్ లులు త‌దుపరి చిత్రం తెర‌కెక్క‌నుండగా, ఈ మూవీ చన్‌క్జ్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. తాజాగా ధ‌మాకా చిత్ర పోస్ట‌ర్‌ని సోషల్ మీడియా ద్వారా విడుద‌ల చేశాడు ఒమ‌ర్. ముగ్గురు బైక‌ర్స్ హెల్మెట్స్ ధ‌రించి ఉన్నారు. చిత్రంలో పెద్ద యాక్ట‌ర్స్ న‌టించ‌డం లేద‌ని, ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తులే న‌టిస్తున్నార‌ని పేర్కొన్నాడు. గ‌త చిత్రాల మాదిరిగా ఈ చిత్రం స్కూల్ లేదా కాలేజ్ బ్యాక్ డ్రాప్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌డం లేద‌ని కూడా తెలియ‌జేశాడు. గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, గుడ్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌పై ఎంకె న‌జీర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related posts