telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఈ రకం యాపిల్ తో .. ఆనారోగ్యం కొనుక్కొచ్చుకున్నట్టేనట .. జాగర్త!

organic apples causes diseases

కల్తీకి మారుపేరుగా మారిన నేటి మార్కెట్లో ఏది అసలో ఏది నకిలీదో అర్ధం చేసుకోవడం కష్టమే అయినప్పటికీ, కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే తేలికే. రోజూ ఒక యాపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదని ఏది దొరికితే అది తింటే తిప్పలు తప్పవంటున్నారు నిపుణులు. కొన్ని రకాల యాపిల్‌ను తింటే రోగాలు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు. యాపిల్ తినడం నిజంగా మంచిదే. దాని వల్ల శరీరానికి కావలసిన ఎక్స్‌ట్రా ఫైబర్, ప్లావనాయిడ్స్, ఫ్లేవర్లు అందుతాయి. కానీ యాపిల్ పండ్లను పెంచే పద్దతిపై అవి మంచివో కావో ఆధారపడి ఉంటుంది.

ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో ఆర్గానిక్ యాపిల్‌లను తినేందుకే చాలా మంది ఆసక్తిని చూపుతుంటారు. ఆ యాపిల్ పండ్లలోనే దాదాపు 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందట. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో కనిపెట్టారు. ఈ బ్యాక్టీరియా, ఫంగీ, వైరస్‌లు శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయట. 240 గ్రాములు ఉన్న ఒక్కో యాపిల్‌లో సుమారు 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందని అంటున్నారు. ఇంకా యాపిల్ తాజాగా ఉండడం కోసం వాడే కృత్రిమ సాధనాల వల్ల కూడా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. నిజానికి యాపిల్‌కు ఫంగస్‌ వ్యాప్తి చేసే గుణం ఎక్కువగా ఉంటుందని, ఇప్పటికే జరిపిన పలు రకాల యాపిల్ ఉత్పత్తుల ద్వారా నిర్ధారణ అయినట్లు కూడా శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

Related posts