telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉగాది కానుకగా “ఒరేయ్ బుజ్జిగా”… దిల్ రాజుకు పోటీ కూడా…!

OB

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ జంటగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఫుల్ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌ల‌వుతుంది. అదే రోజు నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ సినిమా రిలీజవుతోంది. దిల్ రాజు నిర్మాత కాబట్టి పండుగ సీజన్‌లో ఎక్కువ థియేటర్స్ ‘వి’ సినిమాకే ఇచ్చే అవకాశం లేకపోలేదు. తనకి ‘లవర్’, ‘ఇద్దరిలోకం ఒకటే’ వంటి ఫ్లాప్స్ ఇచ్చిన దిల్ రాజుతో బాక్సాఫీస్ వద్ద పోటీపడి రాజ్ తరుణ్ హిట్ కొడతాడేమో చూడాలి. యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Related posts