telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేస్తూ వచ్చిన ఆదేశాలు ‘రద్దు’.. : భారత్

orders to shutdown 8 airports was suspended

నేటి ఉదయం నుండి భారత్-పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీనితో ముందస్తు జాగర్తగా భారత్ జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయలను మూసివేస్తూ ఆదేశాలు వెలువరించింది. కానీ ఈ ఆదేశాలను కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రప్రభుత్వం.. వాటిని ఉపసంహరించుకుంది. విమానాశ్రయాలను పునరుద్ధరించాలని ఆదేశించింది. పౌర విమానాల రాకపోకలను యధాతథ స్థితికి తీసుకుని రావాలని సూచించింది. ఈ ఆదేశాలు వెలువడిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే జమ్మూ విమానాశ్రయం తెరచుకుంది. విమానాల రాకపోకలు మొదలయ్యాయి కూడా.

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణనాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం అత్యంత కీలకమైన ఎనిమిది విమానాశ్రయాలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే చండీగఢ్, జమ్మూ, శ్రీనగర్, లేహ్ సహా పంజాబ్ లోని అమృత్ సర్, పఠాన్ కోట్, హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి, కంగ్రా, సిమ్లా విమానాశ్రయాలను మూసివేశారు. అంతేకాకుండా- ఐరోపా, గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి పాకిస్తాన్ గగనతలాన్ని వినియోగించుకోకూడదని కూడా ఆదేశాలు వెలువడ్డాయి.

తాజా ఆదేశాలతో జమ్మూ సహా కొన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు ఆరంభమైనట్లు తెలుస్తోంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకూడదనే ఉద్దేశ్యంతో కేంద్రం ఈ విమానాల రాకపోకలను పునరుద్ధరించినట్లు చెబుతున్నారు.

Related posts