telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బుల్‌బుల్ తుపాన్ తీవ్రత.. ఆరెంజ్ అలెర్ట్‌ జారీ..

orange alert on bulbul cyclone

పశ్చిమబెంగాల్‌పై ఈ తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. బెంగాల్‌లోని కోస్తా తీర ప్రాంతాలపై ఎఫెక్ట్ ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నది. పశ్చిమమధ్య, తూర్పు మధ్య బే ఆఫ్ బెంగాల్ మధ్య కదులుతుందని వెల్లడించింది. సాగర్ ద్వీపం దక్షిణ-దక్షిణ పడమర 450 కిలోమీటర్ల దూరంలో.. బంగ్లాదేశ్లోని ఖేపురారా దక్షిణ దక్షిణ పడమర 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధకారులు తెలిపారు. బెంగాల్‌తోపాటు బంగ్లాదేశ్‌పై తుపాన్ అధిక ప్రభావం చూపిస్తోంని తెలిపారు.

తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. శనివారం తుపాన్ తీవ్ర రూపం దాలుస్తోందని అధికారులు చెప్పారు. తుపాన్ తీవ్రత దృష్ట్యా ఆరెంజ్ అలెర్ట్‌ను అధికారులు జారీచేశారు. బుల్‌బుల్ తుపాన్ ప్రభావంతో మధ్య బెంగాల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ 24 పరగణ జిల్లాలు, ఈస్ట్ మిడ్నాపూర్, హౌరా, హుగ్లీలో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తుపాన్‌తో బెంగాల్ తీర ప్రాంతంలో మోస్తారు వర్షం, పిడుగులు పడతాయని వివరించారు. కోల్‌కతా తీరప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

Related posts