telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఐటీడీఏలో ఉద్యోగ అవకాశాలు

JOBS ITDA Telangana

తెలంగాణలో ఇండియన్ ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టినాఝడ్‌ చోంగ్తూ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తులకు సంబంధించి పలు విభాగాల్లో పని చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఐటీడీఏ పరిధిలో కార్యనిర్వహక సిబ్బంది అవసరమని పేర్కొన్నారు.

పోస్టులు, అర్హత వంటి వివరాలను అభ్యర్థులు http://twd.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను [email protected] మెయిల్‌కు జనవరి 10వ తేదీ లోపు సమర్పించాలని కమిషనర్‌ పేర్కొన్నారు

Related posts