telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

ఒప్పో .. రెనో .. వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్లు… అందుబాటు ధరలు..

oppo reno released in India today

నేడు ఒప్పో మొబైల్ ఉత్పాదక సంస్థ నూత‌న స్మార్ట్‌ఫోన్ రెనో ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.4 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగ‌వంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. అలాగే వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ సైడ్ లిఫ్టింగ్ కెమెరాను అమ‌ర్చారు. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. రూ.32,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు జూన్ 7వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

ఒప్పో రెనో ఫీచ‌ర్లు :

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌,
8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌,
ఆండ్రాయిడ్ 9.0 పై,
డ్యుయ‌ల్ సిమ్,
48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
oppo reno released in India todayఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,
డాల్బీ అట్మోస్,
డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 5.0,
ఎన్ఎఫ్‌సీ,
యూఎస్‌బీ టైప్ సి,
3765 ఎంఏహెచ్ బ్యాట‌రీ-ఫాస్ట్ చార్జింగ్‌.

Related posts