telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఆన్‌లైన్‌ డిస్కౌంట్ల పేరుతో ఘరాన మోసం

online fraiud offer

ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ ప్రకటనలిస్తున్న నకిలీ వెబ్‌సైట్లను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రయదర్శిని సూచించారు. మోసాలకు పాల్పడే ఈ-కామర్స్ వెబ్‌సైట్లపై అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదులపై ఈ సందర్భంగా ఆమె వివరించారు. సైబరాబాద్ పరిధిలో నివాసముండే బాధితుడి సెల్‌ఫోన్‌కు ఈ నెల 11న హెచ్-మోన్‌టక్ పేరుతో ఎంఆర్‌పీ మీద 60 శాతం డిస్కౌంట్ ధరలకు మోంట్‌బ్లాక్ ఉత్పత్తులు లభిస్తున్నాయంటూ మెసేజ్ వచ్చింది.

దీంతో ఆయన https://www.montblancofficial.com/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రూ.12 లక్షల విలువైన వస్తువులను ఎంపిక చేసుకున్నాడు, డిస్కౌం ట్ తరువాత రూ.503,140 చెల్లించాల్సి ఉంది. దీంతో ఆ సంస్థ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి డెలివరీకి సంబంధించిన వివరాలను అడిగాడు. మొత్తం డబ్బు చెల్లించాలని, ఆ తరువాతే వస్తువులు మూడు రోజుల్లో సూచించిన చిరునామాకు డెలివరీ అవుతాయంటూ సూచించారు. దీంతో బాధితుడు ఆ డబ్బు చెల్లించాడు. తీరా ఇంటికి వచ్చిన వస్తువులను పరిశీలిస్తే అవన్నీ డూప్లికేట్ వస్తువులని తేలాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఆమె తెలిపారు.

Related posts