telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రేషన్ షాపుల ద్వారా .. ఉల్లి అందుబాటులోకి ..కిలో 24కే .. : కేజ్రీవాల్

kejriwal on his campaign in ap

భారీవర్షాలకు అధిక పంట నష్టపోవటంతో ఉల్లి సహా కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కసారిగా ఉల్లి ధరకు రెక్కలు రావడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సామాన్య ప్రజలు మార్కెట్ కి వెళ్లి ఉల్లిని కొనాలంటేనే జంకుతున్నారు. కానీ రోజు వండే ఆహారం లో ఉల్లి కామన్ కాబట్టి కొనక తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 40 రూపాయల నుంచి 50 రూపాయల పలుకుతున్న ఉల్లి ధర… దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 70 రూపాయలు పలుకుతుంది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉల్లి ధర తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో కిలో ఉల్లిని ధర 23.90 రూపాయలకే అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ఒక్కొక్కరికి ఐదు కేజీల వరకు మాత్రమే ఉల్లి ని అమ్ముతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో 60 నుంచి 80 రూపాయల వరకు ఉల్లి ధర పలుకుతుండగా ఢిల్లీ ప్రజలకు 24 రూపాయలకే అందిస్తున్నామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రాబోయే ఐదు రోజుల్లో ఒక లక్ష కిలోల ఉల్లిని కొనుగోలు చేస్తామని … ఆ తర్వాత వాటిని ఢిల్లీ ప్రజలకు విక్రయిస్తామని తెలిపారు. రేషన్ షాపుల ద్వారా మొబైల్ వ్యాన్ ల ద్వారా ఉల్లి అమ్మకాలు 24 రూపాయలకే జరుగుతాయని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Related posts