telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో 25కే .. ఉల్లి .. అక్రమ నిల్వలపై కఠిన చర్యలు..

onions

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరను తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ కి డిమాండ్ తగ్గ సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఇప్పటికే ఉల్లిపాయలు కిలో 100 రూపాయిలు దాటిపోయింది. దీంతో సామాన్యులు ఉల్లిపాయలు కొనాలంటే ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ రెండు మూడు వందలు అయ్యే అవకాశం కూడా ఉంది అని మార్కెట్ నిపుణులు కూడా చెప్తున్నారు. దీంతో ఈ ఉల్లి ధరలు అదుపులోకి తీసుకొచ్చేనందుకు కేంద్రం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే ఇటు ఏపీ సర్కార్ కూడా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కిలో ఉల్లిపాయలు కేవలం రూ.25కే అందించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. మార్కెటింగ్ శాఖ అధికారులతో గురువారం (నిన్న) జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇరవై ఐదు రూపాయల చొప్పున రోజుకు 150 మెట్రిక్ టన్నుల ఉల్లిని రైతుబజార్లకు సరఫరా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. నెల రోజుల పాటు అదే ధరకు ఉల్లి విక్రయించాలని సూచించారు. అలాగే అక్రమ నిల్వలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

Related posts