telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఉల్లి చేసిన మేలు.. తల్లికూడా చేయలేదట.. నిజమే అంటున్న పరిశోధకులు.. !

onion is very good for sugar anda

ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యం సరిలేకుంటే ఏమిలేనివాడిలాగే సాగుతుంది జీవితం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యం కూడా చూసుకోకుండా నేటి హడావుడి జీవితం గడిపేస్తున్నారు చాలా మంది. దీనితో దీర్ఘకాలంలో చాలా పెద్ద ఆరోగ్య సమస్యలే తలెత్తి బ్రతుకులు ఛిద్రం అవుతున్నాయి. అలా కనిపించకుండా ప్రాణాలను సైతం తీయగల వ్యాధులలో చక్కర వ్యాధి ఒకటి. దానితో నిజంగానే జాగర్తగా ఉండాలి. అందుకే అప్పుడప్పుడు వైద్యుల వద్దకు వెళ్లి చెకప్ చేయించుకుంటుండాలి. తద్వారా ముందస్తు జాగర్త పడ్డట్టు అవుతుంది. ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదన అనేది ప్రతి ఒక్కరి జీవితాశయంగా మారిపోయింది, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సంపాదన వైపు పరుగులు తీస్తున్నారు అందుకే చాలా ఎక్కువ మందికి తక్కువ వయసులోనే బీపీ, షుగర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షుగర్ గురించి, చిన్నా పెద్దా అని తేడా లేకుండా షుగర్ వ్యాధి ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి.షుగర్ వ్యాధి నిర్ములన ఇప్పుడు వైద్యరంగానికి ఓ సవాలు లాంటిది కానీ ఇప్పటికీ దానికి సరైన మందు లేదు. కానీ ఉల్లితో అది సాధ్యం అంటున్నారు హోమియోపతి నిపుణులు.

onion is very good for sugar anda* కేవలం వారం రోజుల పాటు రోజు 50గ్రాముల పచ్చి ఉల్లి తింటే చాలు హై షుగర్ కూడా కంట్రోల్ లోకి వస్తుందని నిపుణులు చెపుతున్నారు.

* ఉల్లి తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది, మగవారిలో అయితే వీర్యకణాల సమస్య పోతుంది.

* పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా,అలర్జీ, ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, నిద్రలేమి వంటివి రావు. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు అన్నారేమో!

Related posts