telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఉల్లిని నిల్వ చేస్తే సహించేది లేదు.. దళారులకు కేంద్ర మంత్రి వార్నింగ్

ramvilas paswan

బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయించేందుకు ఉల్లిని నిల్వ చేస్తే సహించేది లేదని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ దళారులకు వార్నింగ్ ఇచ్చారు. గత నెలతో పోలిస్తే ఈనెల 300శాతం ధర పెరిగిపోయిందని మంత్రిఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉల్లి సరఫరా నిలిచిపోవడంతో ఈ పరిణామాలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు.

ఉల్లి కొరతను కృత్రిమంగా సృష్టించేందుకు దళారులు ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదన్నారు. దేశరాజధాని న్యూఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఆకస్మాత్తుగా ఉల్లిధర ఆకాశాన్నంటిందని తెలిపారు. కేజీ ఉల్లి ధర రూ.70 నుంచి 80 రూపాయల వరకు పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. ఉల్లి కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. నాఫెడ్, నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ద్వారా ఉల్లిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

Related posts