telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరో స్లోగన్ ‘ఒకే దేశం-ఒకే రోజు జీతం’ తో .. మోడీ ..

one nation one day salary slogan by modi

ఇప్పటికే ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు; ఒకే దేశం- ఒకే రేషన్‌ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పడు ఒకే దేశం ఒకే రోజు వేతనం అనేది కూడా ప్రస్తుతం సంచలన నిర్ణయం అనే చెప్పాలి. త్వరలోనే ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. శ్రామికవర్గం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ‘వన్‌ నేషన్‌.. వన్‌ పే డే’ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి నెలా సకాలంలో ఒకే రోజు వేతనాలు అందించేందుకు సిద్ధమవుతున్నాం. ఇందుకోసం ఉద్దేశించిన చట్టాన్ని ప్రధాని మోదీ త్వరలోనే తీసుకురాబోతున్నారు. కార్మికులకు మెరుగైన జీవితం గడిపేందుకు అన్ని రంగాల్లో ఒకే విధంగా కనీస వేతనాలు ఉండేలా చర్యలు తీసుకోబోతున్నాం అని సంతోష్ గాంగ్వర్‌ తెలిపారు. సెంట్రల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రైవేట్‌ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ఈ విషయం వెల్లడించారు.

Related posts