telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

లక్కీ డ్రా అంటూ.. మోసం… మిఠాయి చేతిలో పెట్టారట..

one more lucky draw cheating case

లక్కీ డ్రా తగిలిందంటూ వచ్చే ఫోన్‌కాల్స్‌తో తరచూ ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. చక్రాయపేట మండలం వీరనారాయణపల్లెకు షేక్‌ మౌళాకు ఫోన్‌ వచ్చింది. మీ ఫోన్‌నెంబర్‌కు లక్కిడ్రా తగిలింది, రూ.17వేలు విలువైన శాంసంగ్‌ మొబైల్‌ పంపుతున్నాము, మీరు కేవలం రూ.1500 పోస్టాఫీస్‌లో చెల్లించి ఫోన్‌ను తీసుకోవాలని చెప్పారు. శాంసంగ్‌ ఫోన్‌తో పాటు అరతులం వెండి కూడా పంపుతున్నామని, ఒక్క వస్తువు రాకున్నా మీ డబ్బువెనక్కి పంపుతామని చెప్పడంతో మౌళా పోస్టాఫీస్‌కు వెళ్లి డబ్బు చెల్లించి తన పేరుతో వచ్చిన పార్సిల్‌ తీసుకున్నారు.

ఇంటికి వచ్చి పార్సిల్‌ తెరిచిచూడగా అందులో కొద్దిగా పీచుమిఠాయి, చిన్న ఆంజనేయస్వామి బొమ్మ, ఒక చిన్న ప్లేటు ఉన్నాయి. దీంతో మౌలా ఉలిక్కిపడ్డాడు. ఇదే తరహాలో మరో మహిళకు ఫోన్‌ చేసి మీ నెంబర్‌కు లక్కీ డ్రా వచ్చింది. పట్టుచీర, గ్రాము బంగారు పంపుతున్నామని, వస్తువులు పోస్టులో ఇంటికి చేరాక రూ.1500 డబ్బు చెల్లించి తీసుకోవాలని చెప్పారు. ఆమె తన భర్త విలేకరి అనగానే వారు ఫోన్‌ కట్‌ చేశారు. నిందితులు 7349500889, 9606694048 నెంబర్లతో ఫోన్‌ చేశారని వారు తెలిపారు.

Related posts