telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ అంపైర్ మేలా ఫిమేలా..?

ఐపీఎల్ 2020 యొక్క ప్లేఆఫ్ దశల్లో నాలుగు జట్లు చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది. నిన్న జరిగిన మ్యాచ్ తో అభిమానులకు ఆ జట్ల గురించి కొంచెం స్పష్టత వచ్చింది. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ ఓవర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఐపీఎల్ 2020 లో ఇది మూడవ సూపర్ ఓవర్. అయితే అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కాకుండా, ప్రేక్షకులను ఆన్-ఫీల్డ్ అంపైర్ యొక్క హెయిర్ స్టైల్ కూడా బాగా ఆకట్టుకుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆట కోసం ‘పాథక్’ అనే అంపైర్ మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే, సోషల్ మీడియా అంపైర్ యొక్క ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ పై ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. అతను మేలా ఫిమేలా అనే మీమ్స్ తో ట్విట్టర్ నిండిపోయింది. కానీ తర్వాత అతను మేల్(మగ) అంపైర్ అని అందరికి స్పష్టత వచ్చింది. అయితే ఐపీఎల్ 2020 లో పాథక్ కనిపించడం ఇదే మొదటిసారి. అయితే 2014 లో ఈ అంపైర్ ఐపీఎల్ అరంగేట్రం చేసాడు.

Related posts