telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వృద్ధ ప్రేమికుడు.. పెళ్లి తరువాత కూడా ప్రేమ అంటే ఇదే..

old violinist trying to save his wife

పెళ్లి అంటే అవసరం అయిపోయింది.. అందుకే ఆ అవసరం తీరిపోగానే, విడాకులు అనే కార్యక్రమం జరిగిపోతుంది. అయితే భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్న ప్రపంచం మాత్రం ఈ వైవాహిక బంధాన్ని ఎంతో గొప్పగా భావిస్తుంటే, భారతీయులలో కొందరు మాత్రం దానిని అవసరంగా వాడుకుంటుండటం విచారకరం. అసలు పెళ్లి అంటే ఏమిటో సరిగ్గా అవగాహన వస్తే, ఈ విడాకులు వంటివి అత్యవసరమైన వారికి ప్రతిపాదించబడినవిగా కూడా అర్ధం అవుతుంది. కానీ కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతున్నా, దేశసంస్కృతికి అప్పుడప్పుడు ఉదాహరణలుగా కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా, కేన్సర్ బారిన పడిన భార్యను బతికించుకునేందుకు ఓ భర్త ను చూస్తే అర్ధం అవుతుంది. ఆయన పడుతున్న తపన చూసిన వారితో, ఈ సందర్భం కన్నీళ్లు పెట్టిస్తోంది. 75 ఏళ్ల వయసులో వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా వయోలిన్ వాయిస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నాడు.

కోల్‌కతాకు చెందిన స్వపన్ సేఠ్ భార్య పూర్ణిమ 2002లో గర్భాశయ కేన్సర్ బారిన పడింది. భార్యను ఎలాగైనా రక్షించుకోవాలని స్వపన్ భావించాడు. అయితే, ఆమెకు ఖరీదైన కేన్సర్ వైద్యం అందించే స్తోమత ఆయనకు లేదు. కానీ, భార్యను రక్షించుకోవాలన్న తపన ఉంది. దీంతో, ఆయనకు తాను వయోలనిస్ట్‌నన్న విషయం గుర్తొచ్చింది. ఆ మరుక్షణం నుంచి వయోలిన్ పట్టుకుని బయటకొచ్చాడు. వయోలిన్ వాయిస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నాడు. భార్యను బతికించుకోవడానికి ఆయన పడుతున్న తపన గురించి తెలిసి అందరి హృదయాలు ద్రవించి స్పందిస్తున్నాయి.

Related posts