telugu navyamedia
వ్యాపార వార్తలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ సేల్స్ బంద్‌..

ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు జ‌నాలు మొగ్గు చూపుతున్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. ప‌ట్టు మ‌ని 10 రోజులు కూడా నిండ‌లేదు.. అప్పుడే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం జనం ఎగబడుతున్నారు. ఓలా ఎలక్ట్రిక్‌ వెహకిల్స్‌ బుకింగ్‌లోనూ సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పింది.

Ola Electric Scooter: భారత్‌లో ప్రారంభమైన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొనుగోళ్లు.. ఫీచర్స్‌, ధరల వివరాలు ఇలా..!

రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 1100 కోట్లు విలువైన స్కూటర్ల కోసం ఆర్డర్లు వచ్చాయి. ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున ఆర్డర్లు రావటంతో గురువారం రాత్రి సేల్స్ ప్రక్రియను ఆపేశారు. భారీగా స్పందన వస్తుండటం సంతోషంగా ఉందని సంస్థ సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు. ఆర్డర్లు ఎక్కువగా ఉండటంతో సేల్స్ ప్రక్రియ ఆపేశామని…నవంబర్ ఒకటో తేదీన సేల్స్ మళ్లీ స్టార్ట్ చేస్తామని ఓలా సీఈవో భవీష్ చెప్పారు.

ఆటోమొబైల్ చరిత్రలోనే రికార్డ్…
ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం భారీగా స్పందన వస్తుండటం ఓలా యాజమాన్యాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బుధవారం ఆన్‌లైన్‌లో మొద‌లైన ఓలా స్కూట‌ర్ల ఆర్డర్లు తొలి 24 గంట‌ల్లో 600 కోట్ల రూపాయల స్కూటర్లు అమ్ముడయ్యాయి. అంటే సెకను 4 స్కూటర్లు. రెండో రోజు సేల్స్ మరో 500 కోట్లకు చేరాయి. మొత్తంగా సేల్స్ 1100 కోట్లు ఆర్డర్స్ వచ్చాయి. ఆటోమొబైల్ చ‌రిత్ర‌లోనే ఇది ఒక రికార్డ్. ఈ కామర్స్ బిజినెస్ లోనూ ఈ స్థాయిలో స్పందన రావటం ఆశ్చర్యంగా ఉందని భవిష్ అగ‌ర్వాల్ ప్ర‌క‌టించారు.

Ola Electric Scooter: 'ఓలా' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలుకు సంస్థ ప్రత్యేక సౌకర్యం

త్వరలోనే డెలివరీ టైమ్ ప్రకటించనున్న సంస్థ..
ఓలా ఎలక్ర్టిక్ వెహికల్స్ కోసం గత నెల 15 న ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రొ మోడల్ స్కూటర్లను సంస్థ ఆవిష్కరించింది. ఐతే జులైలోనే రూ. 499 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసే చాన్స్ ఇచ్చింది. రూ. 499 తో బుకింగ్ చేసుకోవచ్చని ప్రకటించటంతో 24 గంటల్లోనే దాదాపు లక్షకు పైగా స్కూటర్లు బుక్ అయ్యాయి. ఆ తర్వాత రూ. 15 నుంచి 20 వేలు చెల్లించి ఓలా యాప్ నుంచి బైక్ ను కొనుకోవచ్చు. స్కూటర్ డెలివరీ టైమ్ లో మిగతావి చెల్లించాలి. ఓలా స్కూటర్ ఎప్పుడు డెలివరీ చేస్తామన్నది మూడు రోజుల్లో సంస్థ ప్రకటించనుంది.

Related posts