telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

25 ఐదేళ్ళ యువతి తల్లిదండ్రులకు షాక్… డిఎన్ఏలో ఐదుగురు తండ్రులు

DNA

అమెరికాలోని ఒహియోకు చెందిన భార్యాభర్తలకు ఊహించని షాక్ తగిలింది. 25 ఏళ్లపాటు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తమది కాదని తెలియడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరోగసి పద్దతిలో కూతురును కన్న ఆ జంట తాజాగా నిర్వహించిన డీఏన్ఏ టెస్టులో ఆమె వారి కుమార్తె కాదని తేలింది. దీంతో దీనికి కారణమైన సంతానోత్పత్తి కేంద్రంపై దంపతులు కోర్టులో దావా వేశారు. జోసెఫ్ కార్టెలోన్ మాట్లాడుతూ… తాను తన భార్య ఇటీవల నిర్వహించిన డీఏన్ఏ టెస్టులో గత 25 ఏళ్లుగా పెంచుకుంటున్న అమ్మాయి తమ కూతురు కాదని తేలింది. టెస్టులో ఆమెకు ఐదుగురు తండ్రులు ఉన్నట్లు వచ్చింది. ఆమెకు తాను బయోలజికల్ ఫాదర్ కాదని తేలియడంతో షాక్ అయ్యానని చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్లు ఎంతో ప్రేమ, శ్రద్ధ వహించే ఎవరైనా మీ సొంత కుమార్తె కాదని, మీకు ఆమెతో జన్యుపరంగా ఎలాంటి సంబంధం లేదని తెలిస్తే ఎలా ఉంటదో.. ఆ మనోవేదన వర్ణణాతతీమన్నాడు. 1994లో సిన్సినాటిలోని మూడు ఆరోగ్య సంస్థల్లో జోసెఫ్ కార్టెలోన్ దంపతులు సంతానోత్పత్తి చికిత్స పొందారు. ఆ మూడు సంస్థల నిర్లక్ష్యం కారణంగానే తమకు ఈ పరిస్థితి దాపురించింది అతడు వాపోయాడు. అసలు మా కూతురు తండ్రి ఎవరో కూడా తెలియకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తాము నిర్వహించిన డీఏన్ఏ టెస్టులో తమ అమ్మాయికి ఐదుగురు తండ్రులు ఉన్నట్లు వచ్చిందన్నాడు. అందులో ఓ వ్యక్తి క్రిస్ట్ ఆసుపత్రిలో పని చేశాడని జోసెఫ్ పేర్కొన్నాడు. తమకు జరిగిన అన్యాయం మరే తల్లిదండ్రులకు జరగకూడదన్నాడు. ఈ కేసును న్యాయస్థానం సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపిస్తే నిజనిజాలు బయటకు వస్తాయన్నాడు. తన కూతురికి తండ్రి ఎవరో కూడా తెలియదని, అసలు తన వీర్యాన్ని ఏ మహిళ అండాలతో ఫలదీకరణం చేయించారో తెలియకుండా ఉందని జోసెఫ్ కార్టెలోన్ వాపోయాడు. తమకు జరిగిన అన్యాయంపై సంతానోత్పత్తి కేంద్రాలు సమాధానం చెప్పాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు.

Related posts