telugu navyamedia
news telugu cinema news

ఓ వాసక సజ్జికా!

oh vasaka sajjika poetry corner
ఓ వాసక సజ్జికా!
నీ అధరాల మధువనంలో 
కలపిక కూజి తాన్నై
రవళించిన క్షణాలు-
   స్మృతులై ,కృతులై
 గుబాళిస్తుంటే 
నీ సౌందర్యం అనంత ప్రకృతిలో 
అమందానంద కుంద మందార సందోహ
 పుష్ప పరిమళాలై-
నా మదిలో పరివ్యాప్త మౌతుంటే-
నీ ,నా ,ప్రేమైక జన్మలు  అమరమైతే,
 అనంతమైన ఆనందం- 
అవ్యాజమైన ప్రేమ సౌగంధం-
ఓ వాసక సజ్జికా!
వలపు కడలిలో పెనవేసుకున్న
 తనూలతల బంధం-
ఏక జీవ రూపమే మన
  ప్రణయానుబంధం-
-మహేంద్రాడ సింహాచలాచార్య, టెక్కలి

Related posts

“ఇస్మార్ట్ శంకర్” ట్విట్టర్ టాక్

vimala p

ఎవరో చేసిన పొరపాటుకు విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం బాధాకరం : డైరెక్టర్ మారుతీ

vimala p

ఈసెట్‌ ఫలితాల్లో గందరగోళం.. విద్యార్తులందరికి సున్న మార్కులు!

vimala p