telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఓ  సుదతీ!

vedukolu poetry corner
నీ  శ్రీరమణీయ భావ ఝరిలో…
పండు వెన్నెల పున్నమి లాహిరిలో…
గోముగా సంధించే 
నీ ఆల్చిప్పల కనుపాపల్లో…
ప్రీతి పరవశమైన 
నా మది లోగిలి పొదరిల్లులో…
హరిణివే – తరుణివే… 
అనుబంధాల అనురక్తివే…
సిగ్గుల మొగ్గవై – హర్షానురక్తి వై
నాకోసం ప్రభవించిన ఈవు 
నీ కోసం జనియించిన ఏను
నా గాదిలి ప్రియంవదా!
నాలో ప్రేమ రాగారవిందా!
ఎన్నెన్ని పుట్టుకల అనుబంధమో…
సృష్టి ప్రదాత మనపై చూపే కనికరమో…
ఓ సుదతీ!
నా మనోభావాలు నెరిగి 
మసలే అభిమతీ!
నీ నగవుల వెన్నెల కిరణాలు…
నా జీవన వేదంలో ప్రేమాభరణాలు…
నీ సఖ్యం  –  నీ సాంగత్యం…
నాలో కవికి ప్రణయ భాష్యం…
-మహేంద్రాడ సింహాచలాచార్య,
టెక్కలి

Related posts