telugu navyamedia
సినిమా వార్తలు

ఓ ప్రియతమా . . ! నా ప్రాణమా . . ! 

priya na pranama poetry corner

ఓ ప్రియతమా. . !  నా ప్రాణమా ! 
నీ గాఢంగా ప్రేమించిన హృదయమా
నీ జతగా చేరి ప్రేమ వీణ శృతి చేసి 
ప్రణయ గీతాలు పాడుకుంటాను  ! 
నీ ప్రేమ తీరములో. .! 
వలపు క్రీడలు అలసిపోయేంతగా ఆడుకుంటాను !
నీ తీయని ఆ కౌగిలిలో . . !
వెన్న పూసలా కరిగిపోతాను . . ! 

ఓ ప్రియతమా. .  ! నా హృదయమా . . !  
నీ ఆలనలో  నిరతం 
నేను పరవశించిపోతాను . 
నీ చిరు నవ్వుల జల్లుల్లో . . ! 
నిలువెల్లా తడిసిపోతాను . 
నీ చిలిపి చూపుల వలలో. . ! 
చిక్కుకుని నీతోనే జీవితాంతం బంధీనౌతాను . 
నీ జతలో . . ! నీ హృదిలో. . ! 
కలకాలం కాపురం ఉండిపోతాను . . ! 

ఓ ప్రియతమా. . !  నా హృదయమా. . !  మలయమారుతములా . . !
కలహంసలా  కదలిరా వే . . ! 
ఈ ప్రేమ పిపాసిని కరుణించవే . . ! 
నా ప్రియతమా . . ! కటాక్షించవే . . !  ! 

-పల్లోలి శేఖర్ బాబు, కొలిమిగుండ్ల

Related posts