telugu navyamedia
telugu cinema news

“ఓ ప్రియ రాగమా!”

bhuvi devi poetry corner
మహిలో.. ప్రతి మానసంలో…
వాణినే పూజింతురు
 దివ్యజ్ఞాన మునకై-
లక్ష్మి నే కొలుతురు
 నిత్య సంపద కై-
గౌరి నే జపియింతురు
నిత్య భుక్తికై-
మూడు మూర్తుల
ఆ ముగురమ్మలు
కలిసున్న-
నవ రసాలతో నిండియున్న-
ఓర్పు, నేర్పు, 
అందమైన మేను కూర్పు,
 మంచి మనసున్న-
నా మనసు దోచిన-
“ఓ ప్రియ రాగమా!”
ప్రత్యక్షమైతివే
 నా కనుల ముందు
ప్రేమ సౌందర్యమా!
నేటికి నీ ఆగమనం
ఎన్నె న్ని జన్మల అనుబంధం-
నీవే  నా  అంతరంగ
 శ్వాసకు శృతి-
నీవే కలువులకు ప్రీతి-
నీవే హంస నడకల నాతి-
నీవే సుప్రభాతపు భాతి-
నీవే నా హృదయంలో  
సదా  పరిమళించే
 ప్రణయ ద్యుతి-
-అంశుమాలి, టెక్కలి.

Related posts

“మహానటి”కి కేటీఆర్ శుభాకాంక్షలు

vimala p

స్లమ్ ఏరియాల్లో ఉంటున్న పేదలను ఆదుకుంటున్నఅమితాబ్

vimala p

“గడ్డలకొండ గణేష్” హిందీ రీమేక్ లో మిల్కీ బ్యూటీ

vimala p